ఓటేసిన దేవెగౌడ కుటుంబం

devegowda family
devegowda family


బెంగళూరు: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ నిలకడగా కొనసాగుతుంది. 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన సతీమణి కలిసి తమ ఓటు హక్కును వినయోగించుకున్నారు. హసన్‌లోని పాదువలహిప్పి పోలింగ్‌ కేంద్రంలో దేవెగౌడ దంపతులు ఓటేశారు. కర్ణాటక సియం కుమారస్వామి, ఆయన సతీమణితో పాటు కుమారుడు నిఖిల్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిఖిల్‌ మాండ్య నుంచి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ హసన్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ప్రజ్వల్‌ కోసం దేవెగౌడ తన సీటును త్యాగం చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/