ప్రధాని మోడికి లేఖ రాసిన దేవెగౌడ

  • తాత్కాలిక సాయం కింద రూ.5 వేల కోట్లు విడుదల చేయాలి
Deve Gowda
Deve Gowda

బెంగళూరు: కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కరుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. ఈ సందర్భంగా జేడీఎస్‌ అధినేత దేవెగౌడ్‌ ప్రధాని మోడికి లేఖ రాశారు. వరదల పరిస్థితిని వివరిస్తూ ప్రధాని మోడికి ఈ లేఖ రాశారు. ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని, సహజ విపత్తుగా గుర్తించి తాత్కాలిక సహాయం కింద రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. కాగా, వరదల కారణంగా కర్ణాటకలోని బెళగావి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కర్ణాటక రాష్ట్ర ప్రక‌ృతి వైపరీత్యాల పర్యవేక్షణా కేంద్రం తాజాగా హెచ్చరిచ్చింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/