దేవరగట్టు కర్రల సమరంలో 50మందికి గాయాలు

devaragattu stick fight
devaragattu stick fight

కర్నూలు: కర్నూలు జిల్లాలోని హోళగుండ మండలం దేవరగట్టులో ఏటా విజయదశమి రోజున జరిగే కర్రల సమరంలో 50 మందికి పైగా గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారు ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా ఏర్పడి కరల్రతో తలపడడం ఇక్కడ ఆనవాయితీ వస్తున్న ఆచారం. ప్రతి ఏడాదిలాగే తమ ఇలవేల్పును దక్కించుకోవాలనే మూడనమ్మకంతో ఈ సమరంలో దిగుతారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు, భక్తులు లక్షలాదిగా తరలి రావడం విశేషం. వెయ్యిమందికి పైగా పోలీసులు బందోబస్తు మధ్య ఈ బన్నీ ఉత్సవం జరిగింది. దీనిపై అవగాహన కల్పించేందుకు పోలీసులు నెలరోజుల ముందే అవగాహన కార్యక్రమాలను నిర్వహించినా పెద్దగా ఫలితం లేదు. క్రీడలో పాల్గొనేవారిలో అధికశాతం మంది మద్యం తాగి రావడంతో ఎక్కువగా గాయపడినట్లుగా తెలుస్తోంది.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/andhra-pradesh/