సంక్షోభం అంచున డాయిచే బ్యాంక్‌!

Deutsche Bank
Deutsche Bank

హైదరాబాద్‌: బ్యాంకింగ్‌ రంగంలో కింగ్‌ డాయించే బ్యాంక్‌ ప్రస్తుతం ఈ బ్యాంక్‌ సంక్షోభం అంచుల్లోకి చేరింది.అమెరికాలో అడుగుపెట్టింది మొదలు జేపీ మోర్గాన్‌, సిటీగ్రూప్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాకు పోటీ ఇచ్చింది. కానీ, ఇటీవల మాత్రం ఆ బ్యాంకులతో తాను పోటీపడే పరిస్థితి లేదని తేల్చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సేవలకు స్వస్తి చెబుతూ దాదాపు 18వేల మందికి ఉద్వాసన పలికింది. బ్యాంక్‌ పునర్‌ వ్యవస్థీకరణ దిశగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. 200708 తర్వాత చేపట్టిన అతిపెద్ద బ్యాంకింగ్‌ పునర్‌ వ్యవస్థీకరణగా ఈ ప్రక్రియ నిలిచింది.
ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో 3.5బిలియన్‌ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. 2015 తర్వాత ఈ బ్యాంక్‌కు ఇంత మొత్తంలో నష్టాలు ఎన్నడూ రాలేదు. పునర్‌ వ్యవస్థీకరణ వ్యయాలు పెరగడంతోనే ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ సర్దిచెప్పుకొంది. కానీ, వాల్‌స్ట్రీట్‌లో మాత్రం ఈ బ్యాంక్‌ షేర్ల పతనం ఆగడంలేదు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/