‘డిటాక్స్ డైట్’ జాగ్రత్తలు
-ఆరోగ్య సూత్రాలు
‘డిటాక్స్ డైట్ మంచిదని, వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే బాగుంటుందని, జీర్ణకోశానికి విశ్రాంతి ఇవ్వొచ్చని, శరీరంలో ఉన్న మలినాలను తొలగించొచ్చని.. ప్రతీ శుక్రవారం ఉపవాసం ఉంటారు. అయితే దీనివల్ల తలనొప్పి వస్తోంది. సాయంత్రానికి నీరసం వస్తోంది.
ఇలా రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలి? డిటాక్స్ డైట్ ఎలా చేయాలి అని తెలుసుకుందాం…
డిటాక్స్డైట్, ఉపవాసం శరీరానికి ఒకవిధంగా మేలు చేస్తాయి. మరొక విధంగా చెడు చేస్తాయి. డీటాక్స్ అంటే శరీరంలో ఉన్న టాక్సిన్లను తొలగించడం. ఏ టాక్సిన్ ఏ ఆహారాన్ని తొలగింస్తుందనే విషయం నిజానికి తెలియదు.
కానీ జీర్ణకోశం, కాలేయం, చర్మం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మన శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని నిరంతరం తొలగిస్తూనే ఉంటాయి. ఇదే సరైన డిటాక్సిఫికేషన్ మరి డిటాక్స్డైట్ సంగతి ఏంటి? అంటే.. వాడుకలో చాలా రకాల డీటాక్స్ డైట్స్ ఉన్నాయి.
ఉపవాసం (ఇప్పుడు మీరు చేస్తున్నది). దీనిలో భాగంగా ఒకటి నుంచి మూడు రోజుల వరకు ఉపవాస చేస్తారు కొందరు పండ్లు, కూరగాయలు మాత్రమే తీసుకోవడం (వారానికి ఒకసారి ఇది చాలా మేలు చేస్తుంది).. కేవలం నిమ్మరసం, ఉప్పు కలి పిన నీళ్లు మాత్రమే తాగి ఉండటం.
కొలోన్ క్లీన్సింగ్ (పెద్ద ప్రేగు వుభ్రం చేయడం.. దీనిని ప్రత్యేకంగా ఎనిమి ఇచ్చి చేస్తారు). విరోచనకారిణి(లాక్సేటివ్స్)ఉపయోగించడం.
ఎలా చేయాలంటే…
సమతుల ఆహారం తీసుకోవాలి. పీచుపదార్థం సమృద్ధిగా ఉండాలి. అప్పుడు మలబద్దకం లేకుండా ప్రతిరోజూ సుఖ విరోచనమై పెద్ద పేగులో పేయిన్న విషపదార్తాలన్నీ పోతాయి. వారానికి ఒకసారి పండ్లు, కూరగాయలు మాత్రమే తినడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది.
పేగుల్లో పేరుకున్న మలం విసర్జన జరుగుతుంది. నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి. దీనివల్ల జీర్ణకోశం, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.ఇక ప్రతీరోజూ చాలామంది డీటాక్స్ వాటర్ అని నిమ్మ బద్దలు, కీరా ముక్కలు వేసిన నీళ్లు తాగుతారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.
మూత్రపిండాల ఆరోగ్యం సరిగా ఉండాలంటే రోజుకుకనీసం 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి. డీటాక్స్వాటర్ కూడా ఉపయోగ పడుతుంది.
అవసరానికి మించి ప్రొటీన్ పౌడర్లు, సొంతం గా స్లిమెంట్స్ వాడకం మానెయ్యాలి. ఇవి మూత్రపిండాలు కాలేయం పైన అధిక ఒత్తిడిని కల్గించడమేకాకుండా, హాని కూడా చేయొచ్చు.
కాబట్టి మీరు ప్రతీరోజు సమతుల ఆహారం తీసుకుని, మలబద్ధకం లేకుండా చూసుకుని వారానికి ఒకసారి పండ్లు వెజిటబుల్ సూప్స్, నీళ్లతో ఉపవాసం వేస్తే నీరసం రాదు. మధుమేహం ఉన్న వారు మాత్రం ఉపవాసాలు చేయకూడదు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/