వైస్సార్సీపీ పార్టీకి ఓటేసినందుకు లెంప‌లేసుకున్న వితంతువు..

గడప గడపకు మన ప్రభుత్వం కార్య క్రమం ద్వారా జగన్ ఒకటి అనుకుంటే మరొకటి ఎదురవుతుంది. ప్రభుత్వ పధకాలు ఎంతవరకు ప్రజలకు అందాయో కాదు ప్రభుత్వం ఫై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో అర్ధం అవుతుంది. రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లిన నేతలను నిలదీస్తున్నారు. కొంతమంది నేతలను కొట్టడమే తక్కువ అన్నట్లు ఉంది. ఇప్పటికే ఎంతోమంది నేతలు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలనుండి చివాట్లు , తిట్లు తినగా..తాజాగా ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తికి అలాంటి చేదు అనుభవమే కాదు వింత అనుభవం ఎదురైంది. మీ పార్టీ కి ఓటేసినందుకు లెంపలేసుకుంటున్న అంటూ ఓ వితంతువు డిప్యూటీ స్పీక‌ర్ ఎదుటనే లెంపలేసుకున్న ఘటన బాపట్ల‌లో చోటుచేసుకుంది.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో భాగంగా బాపట్ల‌లో శుక్రవారం ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి పర్యటించారు. పర్యటనలో ర‌ఘుప‌తిని శివ‌లీల అనే వితంతువు నిల‌దీసింది. త‌న‌కు అందుతున్న వితంతు పింఛ‌న్ నిలిచిపోయింద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న కుమారుడికి కారు ఉందంటూ అధికారులు త‌న వితంతు పింఛ‌న్ నిలిపేశార‌ని ఆరోపించింది. అయితే త‌న కుమారుడికి కారు లేద‌ని స్వ‌యంగా ర‌వాణా శాఖ నుంచి స‌ర్టిఫికెట్ ఇచ్చినా త‌న పింఛ‌న్‌ను పున‌రుద్ధ‌రించ‌లేద‌ని శివ‌లీల వాపోయింది. మీ పార్టీ కి ఓటేసినందుకు త‌మ‌కు మంచి శాస్తి జ‌రిగింద‌ని శివ‌లీల‌… కోన ర‌ఘుప‌తి ఎదుటే లెంప‌లేసుకుని మ‌రీ నిర‌స‌న తెలిపింది. ఈ ఘటన తో ర‌ఘుప‌తి షాక్ తిన్నాడు.