మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాం

narayana swamy
narayana swamy

చంద్రగిరి: రాష్ట్ర ప్రభుత్వం మద్యం నుంచి వచ్చే సొమ్మును ఆదాయ వనరుగా చూడటంలేదని ఏపి ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. తిరుపతిలో శిక్షణ పొందిన నూతన ఎక్సైజ్‌ పోలీస్‌ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న 42 మంది పోలీసులకు ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో తొలి దశలో మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా నిర్మూలిస్తామని, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం తమ ప్రభుత్వానికి అవసరం లేదని, ప్రజా సంక్షేమమే ముఖ్యమని అన్నారు. నవరత్నాలు హామీలో భాగంగా మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని, దీన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామని స్పష్టం చేశారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/