లోక్‌సభలో బిజెపి మండిపడ్డా రాహుల్‌

మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేసిందని వ్యాఖ్య

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ లోక్‌సభలో ఈరోజు మాట్లాడుతూ..మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేసిందని మండిపడ్డారు. లోక్ సభలో ఒక్కటే అడుగుతున్నానని, మహారాష్ట్రాలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. దీంతో పెద్ద పెత్తన ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యం హత్య చేయబడిందని అని నినాదాలు చేయడంతో లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా మధ్యాహ్నానికి సభను వాయిదా వేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడమనేది వ్యాపారంలాగా మారిందని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో ఆందోళన నెలకొనడంతో సభను చైర్మన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. మహారాష్ట్రలో ఎన్‌సిపి నేత అజిత్ పవార్‌తో కలిసి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/