ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష చేపట్టిన డికె అరుణ

DK Aruna
DK Aruna

హైదరాబాద్‌: తెలంగాణ బిజెపి నేత, మాజీ మంత్రి డికె అరుణ మహిళా సంకల్ప దీక్ష పేరుతో ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డికె అరుణ తెలంగాణ రాష్ట్రంలో మద్యం నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షను విజయవంతం చేయాలని బిజెపి వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అరుణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, పార్టీ నేత రామచంద్రరావు, మహిళా మోర్చా మరియు ఇతర బిజెపి నాయకులు హాజరై ఆమెకు మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/