డిడిటి తగ్గింపుకోసం ఫండ్స్‌ఇన్వెస్టర్ల డిమాండ్‌!

dividend
dividend

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్‌లోప్రతిపాదించిన డివిడెండ్‌ పంపిణీ పన్నుపై కూడా సడలింపులు తీసుకురావాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. ప్రైవేటు వ్యక్తిగత పన్ను తగ్గింపును అమలుకు తెచ్చింది. మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థను గాడిలోపెట్టేందుకు వ్యక్తిగత పన్నురిబేట్‌ను కూడా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పన్ను పరిమితిని పది లక్షల శ్లాబ్‌లో పరిమితిని పెంచాలని, ప్రస్తుతం 30శాతం ఉన్నరేటును తగ్గిస్తే కొంతమేర మరింత రాబడులు వస్తాయన్న భావనతో ఉంది. కొన్ని పన్ను విరామాలను సడలించడంతోపాటు ఇంటి అద్దె చెల్లింపులు,బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం వంటివి వీటిలో కీలకంగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు కేంద్ర బడ్జెట్‌లో రానున్నట్లు చెపుతున్నారు. 2020 ఫిబ్రవరిలోప్రవేశపెట్టేబడ్జెట్‌ ఇవే కీలకప్రతిపాదనలుగా ఉంటాయని అంచనా. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారుల్లో మరింతగా నగదును చేరిస్తే కొన్ని పన్ను బ్రేడక్స్‌తో మూచువల్‌ఫండ్‌ ఇన్వెస్టర్లకు సైతం కొంత మినహాయింపు కల్పించాలని చెపుతున్నారు. కార్పొరేట్లు, మూచువల్‌ఫండ్స్‌నుంచి డివిడెండ్‌ పంపిణీ పనున పదిశాతంగా ఉంది. కంపెనీలు లాభాలనుంచి డివిడెండ్లు చెల్లిస్తాయి. ఇన్వెస్టర్ల వద్ద పదిలక్షలవరకూ ఎలాంటి పన్నులుండవు. ఇదిలా ఉంటే ఇన్వెస్టర్లు పదిలక్షలకుపైబడి సాలీనా డివిడెండ్లు తీసుకన్న పక్షంలో వారు పదిశాతం డివిడెండ్‌పంపిణీ పన్ను (డిడిటి)ని చెల్లించాల్సి ఉంటుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/