అమెరికాలో ఆవు పిడకల వ్యాపారం

cow-dung
cow-dung

అమెరికా: ఆవు పిడకల వ్యాపారం అమెరికాకు పాకింది. ఆన్‌లైన్‌ మార్కెట్లో ఆవు పేడ, పిడకల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో వీటికి భారత్‌ లో డిమాండ్‌ ఏ స్థాయిలో ఉంది. తాజాగా విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో వీటికి డిమాండ్‌ పెరుగుతోంది. న్యూజెర్సీలోని ఓ షాప్‌ లో అవు పేడతో రూపొందించిన పిడకలు ప్యాకెట్లలో అమ్మకానికి పెట్టారు. ఇది ఓ భారతీయ ఉత్పత్తి. ఇది తినే పదార్థం కాదు. మతపరమైన విషయాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి అని ప్యాకెట్‌ మీద ముద్రించి ఉండటం విశేషం. పది పిడకలు ఉన్న ఓ ప్యాకెట్‌ ధర మన రూపాయల్లో రూ.214 గా ఉంటుంది. స్థానికంగా నివసించే ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దీన్ని ఫోటో తీసి తన బంధువుకు పంపించాడు. అనంతరం ఇది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయబడి వైరల్‌ గా మారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/