చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ : కన్నా


తూర్పు గోదావరి: ఈరోజు ఏపీ లో తూర్పు గోదావరి లో జరిగిన ఓ మీడియా సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ , సీఎం చంద్రబాబు పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యనించారు. కశ్మీర్ ఉగ్ర దాడి ప్రధాని నరేంద్ర మోదీ పనేనని చంద్రబాబు ఆరోపించడంపై కన్నా మండిపడ్డారు.అలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.