గర్భిణిల పట్ల వివక్ష…ఎస్‌బిఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు

న్యూఢిల్లీ: మూడు నెలల గర్భిణిగా ఉన్న మహిళలను ఉద్యోగంలో చేరకుండా ఆపినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎస్‌బిఐ ఈ మహిళలను “తాత్కాలికంగా అన్‌ఫిట్” అని పేర్కొందని కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బ్యాంక్ చర్య వివక్షపూరితమైనదని, చట్టవిరుద్ధమని ఆమె అన్నారు. ఇది చట్టం ప్రకారం అందించే ప్రసూతి ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందన్నారు. ‘’ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను సేవలో చేరకుండా నిరోధించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. వారిని ‘తాత్కాలికంగా అన్‌ఫిట్’ అని పేర్కొంది. ఇది వివక్ష, చట్టవిరుద్ధం. ఈ మహిళా వ్యతిరేక పాలనను ఉపసంహరించుకోవాలని కోరుతూ మేము వారికి నోటీసు జారీ చేసాము ”అని మలివాల్ అన్నారు.

కాగా, డిసెంబర్ 31 న ఎస్‌బిఐ సర్క్యులర్‌లో మూడు నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను పనిలో చేరకుండా నిలిపివేసింది. గర్భంతో మూడు నెలల కంటే ఎక్కువ ఉంటే, ఆమె తాత్కాలికంగా అనర్హులుగా పరిగణించింది. బిడ్డ ప్రసవించిన తర్వాత నాలుగు నెలలలోపు ఆమెను చేరడానికి అనుమతి ఇచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/