ఢిల్లీ లో న్యూ ఇయర్ రోజున దారుణం..

న్యూ ఇయర్ రోజున ఢిల్లీ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడుపుతూ..ఓ యువకుడు ఎదురుగా వచ్చిన స్కూటీ ని ఢీ కొట్టాడు..అక్కడితో ఆగకుండా కారుకింద ఇరుక్కున్న యువతిని అలాగే 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. తీవ్రగాయాలతో ఆ యువతి రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలోని సుల్తాన్ పురిలో ఓ ఫంక్షన్ కు హాజరైన బాధితురాలు స్కూటీపై ఇంటికి వెళుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం సేవించిన ఐదుగురు యువకులు బలెనో కారు నడుపుతూ ఈ ప్రమాదం చేశారు. యువతిని అలాగే రోడ్డుపై ఈడ్చుకెళుతుంటే మిగతా వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

రోడ్డుపై కీలోమీటర్ల కొద్దీ ఈడ్చుకెళ్లడంతో యువతి ఒంటిపై బట్టలన్నీ చినిగిపోయాయి. తీవ్రగాయాలతో యువతి చనిపోయింది. చివరకు ఓ చోట కారు నుంచి యువతి శరీరం విడిపడిపోయింది. డెడ్ బాడీని గుర్తించి స్థానికులు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.