ఢిల్లీలో హింసాకాండ..కానిస్టేబుల్‌ మృతి

పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధింపు

Protest in Delhi
Protest in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భజన్ పూర్, మౌజ్ పూర్, కబీర్ నగర్ ప్రాంతాల్లో సిఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. ఓ ఆటో రిక్షాను నిరసన కారులు తగులబెట్టారు. పలువురు గన్‌లు కూడా తీసుకొచ్చారు. రోడ్డు డివైడర్లను పగులగొట్టి ఆ రాళ్లను పోలీసులకు విసిరారు. దీంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనపై ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో శాంతి భద్రతలపై లెఫ్టెనంట్ గవర్నర్, కేంద్రమంత్రి అమిత్ షా స్పందించి… అదుపులోకి తీసుకురావాలన్నారు.

మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు మరిన్ని బలగాల్ని కేంద్రం ఢిల్లీకి తరలించింది. నిన్న కూడా జఫరాబాద్, మౌజ్ పూర్ ఏరియాలో అల్లర్లు జరిగాయి. సీఏఏకు అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అయితే రోడ్లను బంధించి ఆందోళనలు చేయడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై అనుకూల వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎవరైనా కనిపిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిన్న కూడా జఫరాబాద్ ఏరియలో మెట్రో స్టేషన్ వద్ద సిఏకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో అధికారులు మెట్రో స్టేషన్‌ను మూసివేసి పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ముస్లీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ మూడు ప్రాంతాల్లో నిన్నమొన్నటి వరకు సిఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సిఏకు అనుకూలంగా కూడా కొంతమంది ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/