అలాంటివాళ్లకే నేను ఉగ్రవాదిలా కనిపిస్తున్నా

యాకుబ్‌ మీనన్‌, ఉమర్‌ ఖలీద్‌ లాంటి వాళ్లను కోర్టుకెళ్లి విడుదల చేయించారు

kapil mishra
kapil mishra

న్యూఢిల్లీ: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత కపిల్‌ మిశ్రాను అరెస్టు చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ కపిల్‌ మిశ్రా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. బుర్హాన్‌ వనీ, అఫ్జల్‌ గురు లాంటి వాళ్లను ఉగ్రవాదులుగా భావించని వాళ్లే..కపిల్‌ మిశ్రాని ఉగ్రవాది అని పిలుస్తున్నారని విమర్శించారు. యాకుబ్‌ మీనన్‌, ఉమర్‌ ఖలీద్‌, షర్జీల్‌ ఇమామ్‌ లాంటి వాళ్ల కోసం కోర్టుకెళ్లి విడుదల చేయించుకున్న వాళ్లు కపిల్‌ మిశ్రాను అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. జై శ్రీరాం అని వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/