ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్ పై చర్చించాం

కరోనాను ఎదుర్కొనేందుకు కలిసి పని చేయడంపై చర్చించాం

arvind-kejriwal
arvind-kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోడితో భేటి ముగిసింది. సమావేశం అనంతరం కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్ పై ఇరువురం చర్చించామని తెలిపారు. ఢిల్లీ అల్లర్లకు ఎవరు కారణమైనా, ఏ పార్టీకి చెందినవారైనా వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానికి తాను చెప్పానని అన్నారు. దేశ రాజధానిలో ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని కోరానని చెప్పారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కలసికట్టుగా పని చేయడంపై కూడా ఇరువురం చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని… ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విస్తరిస్తోందని తెలిపారు. ఢిల్లీ అల్లర్లకు కారణంగా భావిస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలపై చర్చించారా? అనే మీడియా ప్రశ్నకు సమాధానంగా… ఈ అంశంపై ప్రత్యేకంగా ఎలాంటి చర్చ జరపలేదని చెప్పారు. కాగా పార్లమెంటు ప్రాంగంణంలో వీరి సమావేశం కొనసాగింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/