14 రోజుల జుడీషియ‌ల్ క‌స్ట‌డీకి మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ నేత‌, ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ను 14 రోజుల జుడిషియ‌ల్ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. మ‌నీల్యాండరింగ్ కేసులో రోజ్ అవెన్యూ కోర్టు క‌స్ట‌డీకి ఆదేశాలు ఇచ్చింది. గ‌త నెల‌లో ఈడీ ఆయ‌న్ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. 2017 నుంచి మ‌నీల్యాండ‌రింగ్ కేసులో విచార‌ణ జ‌రుగుతోంది. మే 30వ తేదీన మినిస్ట‌ర్‌ను అరెస్టు చేశారు. జూన్ 7వ తేదీన జ‌రిగిన త‌నిఖీల్లో మంత్రి ఇంటి వ‌ద్ద అనేక డాక్యుమెంట్లు, రికార్డులు ల‌భించాయి. స‌త్యేంద‌ర్ జైన్ ఇంట్లో సుమారు రెండు కోట్ల న‌గ‌దును, రెండు కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. విచార‌ణ‌లో జైన్ స‌హ‌క‌రిస్తున్న‌ట్లు ఈడీ చెప్పింది. స‌త్యేంద‌ర్‌కు క‌స్ట‌డీ పొడిగింపును సీనియ‌ర్ అడ్వ‌కేట్లు క‌పిల్ సిబ‌ల్ వ్య‌తిరేకించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/