ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు..విచారణ డిసెంబర్ 15కు వాయిదా

Delhi Liquor Scam case..trial adjourned to December 15

న్యూఢిల్లీః లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై వాదనలు ముగిశాయి. ఛార్జీ షీటును పరిశీలించిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. అనంతరం కేసు విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 25న ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆప్‌ నేత విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లితో సహా ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపుతూ 10వేల పేజీల ఛార్జిషీట్‌ ను రౌస్‌ అవెన్యూ కోర్టులో ఫైల్‌ చేసింది. ఏ1గా ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌, ఏ2గా ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, ఏ3గా అభిషేక్‌ బోయిన్‌పల్లి, ఏ4గా విజయ్‌ నాయర్‌, ఏ5గా అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఏ6గా సమీర్‌ మహేంద్రు, ఏ7గా ముత్తా గౌతమ్‌ పేర్లను చేర్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/