1నుంచి రొటేషన్ పద్ధతిన ఢిల్లీ హైకోర్టు

హైకోర్టు నిర్ణయం

Delhi High Court
Delhi High Court

New Delhi: ఢిల్లీ హైకోర్టు వచ్చే నెల 1 నుంచి రొటేషన్ పద్ధతిన పని చేయనున్నది.

కరోనా వ్యాప్తి ఉధృతి కారణంగా  గత   ఐదు నెలలుగా  హైకోర్టు మూతపడి ఉన్న సంగతి తెలిసిందే.

ప్రయోగాత్మకంగా వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ హైకోర్టు, నగరంలోని ఏడు జిల్లా కోర్టులను రొటేషన్ ప్రాతిపదికన తెరవాలని హైకోర్టు నిర్ణయించింది.

అయితే ప్రజా రవాణా లభ్యత, కరోనా వ్యాప్తి తదితర అంశాలపై ఆధారపడి కోర్టులు తెరవడంపై తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/