ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రమాదం..ఒకరు మృతి

ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కూప్ప కూలింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే రిస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి ఒకరు మాట్లాడుతూ… ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పు కూలిపోయిందనే సమాచార తమకు వేకువజామున ఐదున్నరకు అందిందని తెలిపారు. విషయం తెలుకున్న వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి సిబ్బందితో చేరుకున్నట్టు వెల్లడించారు. మొదట నలుగుర్ని రెస్క్యూ చేశామని తర్వాత శిథిలాల కింద మరో ఇద్దర్ని గుర్తించి బయటకు తీసినట్టు వివరించారు. అదే టైంలో ఒకరు మృతి చెందినట్టు కూడా గుర్తించామని పేర్కొన్నావారు.

కాగా ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు బటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలానే ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ ఎయిర్ పోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. టెర్మినల్ 1 నుండి బయల్దేరే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశామని, అలానే చెక్- ఇన్ కౌంటర్లను కూడా మూసివేశామని, ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. క్షమాపణలు కోరుతున్నామని మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.