జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Jet Airways
Jet Airways

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ మరోసారి ఇబ్బందుల్లో పడింది. కాన్సిల్‌ చేసిన విమాన టికెట్ల డబ్బులను తిరిగి వినియోగదారులకు చెల్లించే అంశంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేసి, ప్రయాణికులను సంక్షోభంలోకి నెట్టి వేసిందనంటూ సామాజిక కార్యకర్త బిజోన్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.బి. భంభాని ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్‌ బుధవారం ఈ నోటీసులిచ్చింది. ఈ వేసవి సెలవుల తర్వాత దీనిపై వాదనలను వింటామని చెప్పిన కోర్టు తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది. దీనిపై జెట్‌ ఎయిర్‌వేస్‌ స్పందించాలని కోరింది. అలాగే ఈ అంశంపై అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ)ను ఆదేశించింది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/