కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు

ప్రాథమిక పాఠశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

delhi-govt-announces-holiday-school-over-coronavirus
delhi-govt-announces-holiday-school-over-coronavirus

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పర్యాటకులు నగరానికి వస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు ఐదో తరగతి వరకు మార్చి 30 వరకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిపోడియా గురువారం ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. మరోవైపు విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ సీడీఎస్‌ఈ విద్యార్థులకు పరిమితమైన వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు ముఖాలకు మాస్క్‌లు ధరించవచ్చని ప్రకటించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/