మద్యం హోం డెలివ‌రీకి ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

ఎల్ 14 లైసెన్స్ ఉన్న షాపులకు ఢిల్లీ సర్కార్​ అనుమతులు

న్యూఢిల్లీ: మందుబాబులకు ఢిల్లీ ప్రభుత్వం ఇంటికే మద్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. లాక్ డౌన్ వల్ల జనం వైన్స్ ముందు క్యూలు కట్టడం, గుంపులుగా చేరుతుండడంతో ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టినా ఇంటికి మద్యాన్ని డెలివరీ చేసేందుకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ (సవరణ) చట్టం 2021 ప్రకారం.. ఎల్ 14 లైసెన్స్ లు ఉన్న అన్ని మద్యం షాపులూ ఇంటికి మద్యం డెలివరీ చేసేందుకు అనుమతులను ఇచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా ప్రజలు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేందుకు అవకాశం ఇచ్చింది.


కాగా, ఢిల్లీలో ఇప్పటికే మద్యం డోర్ డెలివరీకి అనుమతులున్నా.. దానికి పరిమితులున్నాయి. ఈమెయిల్ ద్వారా ఆర్డర్ పెడితేనే మద్యం ఇంటికి వచ్చేది. అది కూడా స్పెషల్ లైసెన్స్ ఉన్న షాపులకే ఆన్ లైన్ మద్యం డెలివరీకి అనుమతి ఉండేది. గత ఏడాది లాక్ డౌన్ విధించగానే మద్యం షాపుల ముందు జనం భారీగా గుమిగూడారు. దీంతో డోర్ డెలివరీ చేసే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఢిల్లీ సర్కార్ కు సుప్రీం కోర్టు సూచించింది. అప్పుడే ఈ మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా ఆర్డర్ చేస్తే ఎల్ 13 లైసెన్స్ కలిగి ఉన్న షాపులు డోర్ డెలివరీ చేసేందుకు ఓకే చెప్పింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/