ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి మోడీ తొలి ట్వీట్

రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలని పిలుపు

pm modi
pm modi

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబందించిన పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ తొలి ట్వీట్ చేశారు. ‘ఢిల్లీ ప్రజలు… ముఖ్యంగా నా యువ స్నేహితులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. కాగా పోలింగ్‌ సందర్భంగా అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని, ఆందోళనకారులను అక్కడినుంచి తరిమేయాలని బిజెపి నేతలు అధికారులను కోరారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా నేడిక్కడ ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరుగుతోంది. ఉదయంనుంచే ఓటర్లు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/