నిర్భయ దోషి పిటిషన్ తిర్కరణ.. రేపే ఉరి

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖాయమైంది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈపిటిషన్‌ను పటియాల హౌస్ కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు ముందు నిర్ణయించిన ప్రకారం రేపే ఉరిశిక్ష అమలు కానుంది. కాగా న్యాయపరమైన అవకాశాలు ఇంకేమీ మిగల్లేదు. పవన్, అక్షయ్ మళ్లీ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను కూడా రాష్ట్రపతి తిరస్కరించారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ న్యాయస్థానానికి తెలియజేశారు. నా స్నేహితుడితో 100 పిటిషన్లు వేయించగలను, అలాంటి పిటిషన్లను కూడా న్యాయపరమైన అవకాశాలుగా భావిస్తామంటే ఎలా? అంటూ ఇర్ఫాన్ అహ్మద్ కోర్టులో వాదనలు వినిపించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/