నాపై దాడి జరగడం ఇది తొమ్మిదోసారి

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతు.. గత ఐదేళ్లలో నాపై దాడి జరగడం మొత్తంగా ఇది తొమ్మిదోసారి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదోసారి. భారతదేశ చరిత్రలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పలుమార్లు దాడి జరగడం బాధాకరం, ఇది ఊహించలేనిది. దేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ బాధ్యత ప్రతిపక్ష పార్టీ బిజెపి చేతిలో ఉంది. ఇలాంటి వింత వ్యవహారం దేశంలోనే ఒక్క ఢిల్లీలోనే ఉంది. ఒక ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఎలాంటి ఫిర్యాదు రాలేదని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడి రాజీనామా చేయాలి. ఇది అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడి కాదు..మొత్తం రాష్ట్ర ప్రజానీకంపై జరిగిన దాడిగా కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/