ట్రోఫీకి చేరువలో ఢిల్లీ క్యాపిటల్స్‌!

delhi capitals team
delhi capitals team


హైదరాబాద్‌: ఆదివారం నాడు సన్‌రైజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ 39 పరుగుల తేడాతో గెలిచింది. గత సీజన్‌తో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌ గేర్‌లో దూసుకెళుతుంది. ఈ జట్టు ఈ సారి టైటిల్‌ కొట్టేందుకు సిద్ధంగా ఉందని, ఆ సామర్ధ్యం ఉందని ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ అన్నాడు. ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితే ఛాంపియన్‌గా నిలవడానికి ఎంతో దూరంలో లేము అని పేర్కొన్నాడు. పెద్ద భాగస్వామ్యాలు విజయం అందిస్తాయని, తమ జట్టులో ఉన్న ఆటగాళ్లంతా చాల మంది ఒకే వయసు గల వారని అన్నారు. అండర్‌ -19 క్రికెట్‌లోనూ కలిసి ఆడిన అనుభవం ఉంది. కీలక బౌలర్‌గా మారిని రబాడా కూడా మాతో ఎంతో క్రికెట్‌ ఆడాడు. కాబట్టి మా మధ్య సమన్వయ భారం ఎక్కువగా ఉందన్నాడు.
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/