ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Voting
Voting

న్యూ ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికలలో మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలలో 1.47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 13,750 పోలింగ్ కేంద్రాలతో పాటు 68 వేల ఎన్నికల సిబ్బందిని వినియోగించుకోనున్నారు. ఈ నెల 11న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. గత ఎన్నికలలో ఆఫ్ 70 సీట్లలో 67 స్థానాలు గెలిచి విజయ దుందుభి మోగించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పోటీపడుతున్నప్పటికీ అది నామమాత్రమే. ఆ పార్టీ పోటీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో బిజెపి కనుక ఓటమి పాలైతే ప్రతిపక్షాలకు మరింత ఊపు లభిస్తుందని, ప్రాంతీయ పార్టీలకు కొత్త ఉత్సాహం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/telangana/