ఆమ్‌ ఆద్మీ పార్టీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్ధతు

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆప్‌ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ట్వీట్‌

derek o'brien
derek o’brien

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీఎంసీ అధికార ప్రతినిధి దేరెక్‌ ఓబ్రెయిన్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఓటేసి గెలిపించాల్సిందిగా తన ట్విట్‌లో పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటేయండి. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభ్యర్థికి ఓటేయండి. కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ అభ్యర్థులందరికీ ఓటేసి గెలిపించండి అంటూ ఆయన పేర్కొన్నారు. ఆప్‌ గతంలో ఇచ్చిన హామీలన్నింఇనీ నెరవేర్చిందని ఓబ్రెయిన్‌ అన్నారు. విద్యావ్యవస్థ, ఎలక్ట్రిసిటీ, వైద్యరంగంలో మార్పులు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ చాలా బాగా పనిచేసిందని ఆయన వీడియో ద్వారా చెప్పుకొచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/