ఢిల్లీ వాతావరణంపై అశ్విన్ ట్వీట్

హైదరాబాద్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా ఢిల్లీలో ‘గాలి నాణ్యత నిజంగా భయానకంగా ఉంది. ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి పరిస్థితులు. మనం తీసుకునే శ్వాసలో ఆక్సిజన్ శాతం అవసరమైనంత ఉండాలి కానీ ఇక పరిస్థితులు అలా లేవు అని ట్వీట్ చేశాడు. కాగా భారత్-బంగ్లా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరున్‌జైట్లీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. కాగా ఢిల్లీలోని వాతావరణ కాలుష్యం కారణంగా ఇరు జట్ల క్రికెటర్లు సమస్యల బారిన పడితే ఏం చేయాలని డిడిసిఎ మదనపడుతుంది. అయితే ఈ మూడు టీ20 సిరీస్‌లో అశ్విన్‌కు చోటు లభించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/