ఎంపీ రఘురామ విడుదలలో జాప్యం!


మరో 4 రోజులపాటు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వెల్లడి

MP Raghurama Krishna Raju
MP Raghurama Krishna Raju

Secunderabad: నరసాపురం ఎంపీ రఘురామ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ ఆగోగ్య పరిస్థితిపై సీఐడీ కోర్టు ఆరా తీసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమర్మరీని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ కోరారు.ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రఘురామను సోమవారం విడుదల చేసే అవకాశం ఉండటంతో తొలుత ఆయన తరుపు న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టుకు వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామను విడుదల చేయాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మెజిస్ట్రేట్ కు తెలపడంతో రఘురామ విడుదల వాయిదా పడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/