గర్భిణుల్లో డీహైడ్రేషన్‌ సమస్య

Pragnancy
Pragnancy

గర్భిణుల్లో డీహైడ్రేషన్‌ సమస్య

మామూలు వారికన్నా గర్భిణులు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీరు వారి శరీర పోషణకు, ఆరోగ్యానికే కాకుండా ప్లాసెంటా (మాయ) నిర్మాణానికి, బిడ్డ సంరక్షణకు ఉపయోగపడే ఉమ్మనీరు తయారీకి చాలా అవసరం. అలాగే మెటర్నల్‌ ఓవర్‌ హీట్‌, గుండెలో మంట, అసిడిటి, రిఫ్లెక్స్‌ ఈసోఫాజైటిస్‌ మలబద్దకం, మొలలు వంటి జీర్ణకోశ సమస్యలు, మూత్రం యూరిన్‌ ఇన్ఫెక్షన్స్‌ కిడ్నీ స్టోన్స్‌, డార్క్‌ యూరిన్‌ రాకుండా అరికడుతుంది. కాబట్టి గర్భిణుల్లో డీహైడ్రేషన్‌ వస్తే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఇది తీవ్రమైన సమస్యగా పరిగణించి వెంటనే చికిత్స అందించాలి. కారణాలు: మామూలుగా డీహైడ్రేషన్‌ మొదటి, మూడవ ట్రెమిష్టర్‌లో ఎక్కువగా వస్తుంది. నీళ్లు తక్కువగా తీసుకునే అలవాటు ఉండటం తాగాలనిపించక పోవటం తరుచు మూత్ర విసర్జన చేయడం, హార్మోన్స్‌ వల్ల వేసవికి అతి చెమటలు, హైపర్‌ వెంటిలేషన్‌ ప్రాబ్లం రావడం, వాంతులు విరోచనాలు కావడం డయాబెటీస్‌, షుగర్‌ లెవల్స్‌ తక్కువగా ఉండటం మానసిక వ్యాధులు మార్నింగ్‌ సిక్‌నెస్‌ -వేవిళ్లు, పోషకాహార లోపం, మెటర్నల్‌ ఓవర్‌హీట్‌, థైరాయిడ్‌, బిపి రీనల్‌ ప్రాబ్లమ్స్‌ ఉండటం, కుటుంబ సమస్యలు, కేర్‌ లేకపోవటం, ఒంటరితనం ఎక్టోపిక్‌ ప్రెగ్రెన్సీ, జ్వరాలు,

ఇన్ఫెక్షన్స్‌, గర్భధారణ 35 సంవత్సరాలు పైబడ్డ తర్వాత రావడం మొదలైనవి ముఖ్యకారణాలు. గర్భధారణ తొలి రెండు మూడు నెలల్లో వికారం, తలనొప్పి అన్నం సహించకపోవటం, వంట చేస్తున్న వాసనలు, కొన్నిరకాలైన ఆహార పదార్థాలు చూస్తే ఏవగింపు రావడం ఏమి తిన్న తాగిన వాంతులు, నీరసం, ఆహారం పడకపోవడం, రక్తంలో హ్యూమన్‌ కొరియానిక్‌ గొనాడే(టోఫిన్‌ హార్మోన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండటం, నీళ్లు తాగడం ఇష్టపడక పోవడం వంటి లక్షణాలుంటాయి.వీటినే హైపరాలసిస్‌ గ్రావిడోరం, మార్నింగ్‌ సిక్‌నెస్‌ , వేవిళ్లు అని అంటారు. కొందరిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి అనేక కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. అలాగే కొందరిలో బియ్యం, మట్టి, సుద్ద, బలపాలు, బొగ్గు, ఇటుక వంటి అబ్‌నార్మల్‌ కోరికలుండి ఎవరికి తెలియకుండా తింటుంటారు. అలాగే పులుపు, నాన్‌వెజ్‌, మసాలాలు, జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ తింటుంటారు. దీనివల్ల కూడా ఆహారం, నీరు కలుషితం కావడం వల్ల, ఇన్ఫెక్షన్స్‌ వల్ల అపరిశుభ్రత వల్ల వాంతులు, విరేచనాలు లేకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్‌, జ్వరాలు వచ్చి గర్భీణీలు డీలా పడిపోతుంటారు. దీని వల్లకూడా డీహైడ్రేషన్‌ ఏర్పడుతుంది.

నెలలు నిండేకొద్ది మూడవ డ్రైమిష్టర్‌ లో కడుపునొప్పి క్రాంప్స్‌ సమస్య మొదలవుతుంది. వేసవిలో ఇది ఎక్కువగా ఉంటుంది. కూర్చునిలేచినా, దగ్గినా, తుమ్మినా, హీట్‌ ట్రెస్‌ వల్ల అలసట, చెమటలు ఎక్సర్‌ సైజు , వాకింగ్‌ చేయటం వల్ల డీ హైడ్రేషన్‌ ఏర్పడుతుంది. జీర్ణశక్తిసరిగాలేకపోవడం, మలబద్దకం, మొలలు,నడుంనొప్పి, కడుపునొప్పి తరుచుగా రావడం, వెజైనల్‌ బ్లీడింగ్‌ తెల్లబట్ట, అతి చెమటతో కూడా డీ హైడ్రేషన్‌ వస్తుంది. తీవ్రమైన డీహైడ్రేషన్‌ : మగత,సృహతప్పిపడిపోవడం, పిల్చినా లేపినా మగతగా ఉండటం, తీవ్రమైన తలనొప్పి, అయోమయం, కడుపునొప్పి, అబ్డామినల్‌ క్రాంప్స్‌,కళ్లులోపలికి పీక్కుపోవడం, ముఖం పాలిపోయిడల్‌గాఉండటం, వికారం, వాంతులు, హీట్‌ఎగ్జార్షన్‌ కోమా,శ్వాససరిగా ఆడక ఇబ్బందిపడటం, లోబి.పి, గుండె వేగం ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. దీన్ని సీరియస్‌ మెడికల్‌ కండీషన్‌గా పరిగణించి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాంప్లికేషన్స్‌: గర్భస్థ పిండంలో ఆకారాలేర్పడటం, కాళ్లుచేతుల లోపాలు, శిశువు ఎదుగుదల సరిగా లేకపోవడం. మలబద్దకం, యూరినరీ ఇన్ఫెక్షన్‌ వంటి లక్షణాలుంటాయి. ఉమ్మనీరు తక్కువగా ఉంటుంది. దీన్నే అలిగో హైడ్రామ్నియా అని అంటారు. దీనివల్ల బొడ్డుతాడు కంప్రెషన్‌, మెకోనియం స్టెయినింగ్‌ వల్ల కాన్పు నార్మల్‌గా కాదు. సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. అబ్డామినల్‌ క్రాంప్స్‌నే బ్రాక్స్‌టన్‌హిక్స్‌ కంట్రాక్షన్స్‌ అంటారు. ఇవి వెజైనల్స్‌ డీహైడ్రేషన్‌ వల్ల ఎక్కువగా వస్తాయి. బ్లీడింగ్‌ అవుతుంది. తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. చూపు మసకగా ఉండి, కళ్లు తిరిగి పడిపోతుంటారు. శరీరం వాపులు, రక్తహీనత ఉంటుంది.

పిండం కదలికలు తక్కువగా లేదా ఆగిపోతుంటాయి. శరీరంలో దురదలుం టాయి. ముఖ్యంగా కొన్ని చేతుల్లో ఎక్కువగా దురదలుంటాయి. జననేంద్రియ దురదలు, వాపు, మంట, తెల్లబట్టతో కూడిన ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. కండరాలు ఎక్కువగా ఇరిటేట్‌గా ఉండటం వల్ల కడుపులో బాధాకరమైన సంకోచాలేర్పడతాయి. దీని వల్ల రక్తం తగ్గి ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి వల్ల నెలలు నిండకుండానే కాన్పు అవుతుంది. గర్భస్థ పిండంలో న్యూరల్‌ ట్యూబ్‌డిఫెక్ట్స్‌ ఏర్పడి అంగవైకల్యం గల పిల్లలు పుడతారు. కాన్పు తర్వాతగా కూడా తల్లిలోనే కాకుండా పిల్లల్లో కూడా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తల్లి పాలుండవు. నెలలు నిండకుండా పుట్టే పిల్లలు పాలు తాగలేకపోతారు. అబార్షన్‌ కావడం, గర్భధారణలో బ్లీడింగ్‌ కావడం, నడుంనొప్పి, కడుపునొప్పి రావడం వంటి అనేక కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.

కిడ్నీడామేజ్‌, లివర్‌ ప్ల్రాసిమ్స్‌ ఏర్పడతాయి. జబ్బుపడిన వారి వయస్సు, డీహైడ్రేషన్‌ తీవ్రత, అనారోగ్య స్థితి, రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ని బట్టి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. జాగ్రత్తలు-చికిత్స: 1. గర్భధారణ అని నిర్థారణ జరిగినప్పటి నేంచే నీళ్లు ఎక్కువగా తాగాలి. 2. పండ్లు, పండ్ల రసాలు, ఆపిల్‌,ఆరెంజ్‌, నిమ్మరసం, ఉసిరి, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. 3. పీచు పదార్థాలున్న ఆకుకూరలు, కూరగాయలు, పోషకాహారం, బార్లీ తీసుకోవచ్చు. 4. వేసవిలో సాధ్యమైనంత వరకు తిరగకుండా ఉండాలి. గొడుగు నీళ్లు బాటిల్‌ తప్పనిసరిగా ఉండాలి. 5. సాధ్యమైనంత వరకు దూరప్రయాణాలు చేయరాదు. 6. శరీరానికి సంపడని వస్తువుల్ని తీసుకోరాదు. లైఫ్‌ స్టయిల్‌ అలవాట్లని తల్లి బిడ్డల ఆరోగ్యం సంరక్షణకోసం మార్చుకోవాలి.చలువ చేసే ఆహారాన్ని తీసుకోవాలి. 7. సడన్‌గా లేవడం చేయరాదు. 8. ఆహారాన్ని నిర్ణీత వేళల్లోకొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవచ్చు. 9. పరిశుభ్రత, రెస్ట్‌ చాలా అవసరం.

– డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి