పవన్ బర్త్ డే సందర్బంగా ఆహా లో భక్తుడి మూవీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడి గా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ నటించిన ‘డేగల బాబ్జీ’ మూవీ సెప్టెంబర్ 2న ‘ఆహా’లో ప్రసారం కాబోతుంది. కమెడియన్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ..అతి తక్కువ టైంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ , రవితేజ , రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు నిర్మించిన గణేష్..ఈ ఏడాది ‘డేగల బాబ్జీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

తమిళంలో జాతీయ అవార్డు అందుకున్న ‘ఉత్త సిరుప్పు సైజు 7’ను తెలుగులో డేగల బాబ్జీగా రీమేక్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సెప్టెంబరు 2న ఆహా ఓటీటీలో ఈ సినిమాను ప్రసారం చేస్తున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించారు.