బిజెపి నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి

కుటుంబ సభ్యులు, ప్రభాస్ ను పరామర్శించి ఓదార్చిన రాజ్ నాథ్

defence-minister-rajnath-singh-met-krishnam-raju-family

హైదరాబాద్ః సినియర్‌ నటుడు, బిజెపి నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజను పరామర్శించారు. పలు అనారోగ్య సమస్యలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, సినీ హీరో ప్రభాస్‌ ను రాజ్ నాథ్ పరామర్శించారు.

కృష్ణం రాజు కుటుంబ సభ్యులు, ప్రభాస్ తో రాజ్ నాథ్ కొంత సేపు మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల తన సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, ఏయే చికిత్సలు అందించారు, ఇతర వివరాలను బిజెపి నేతలు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు వివరించారు. ప్రభాస్ కూడా కొంతసేపు రాజ్ నాథ్ తో మాట్లాడారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన రాజ్ నాథ్, ఇతర బిజెపి నేతలు అక్కడి నుంచి బయలుదేరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/