పోరాడి ఓడిన జింబాబ్వే
టేలర్ సెంచరీ వృధా

రావల్పిండి : పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే పోరాడి ఓడింది. తొలుత పాకిస్తాన్ 8 వికెట్లకు 281 పరుగులు చేయగా, జింబాబ్వే మరో రెండు బంతులు మిగిలి ఉండగా 255 పరుగులకు ఆలౌటయింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బ్రెండన్ టేలర్(112) సెంచరీ చేసి జట్టును దాదాపు గెలిపించినంత పనిచేశాడు. టేలర్ తొలుత ఎర్విన్(41)తో కలిసి అర్ధసెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ కుదుటపరిచాడు.
ఆ తరువాత యువ బ్యాట్స్‌మెన్ మాధవీర్(55)తో కలసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడమేగాక తాను సెంచరీ పూరించాడు.
కానీ వీరిరువ్ఞరూ స్పల్ప వ్యవధిలో అవ్ఞటవడం జింబాబ్వే ఓటమికి కారణమైంది. షాహీన్ అఫ్రిది 5, వాహబ్ రియాజ్ 4 వికెట్లతో రాణించారు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో హారిస్ సొహైల్(71), ఇమాముల్ హక్(58) అర్ధసెంచరీలు చేశారు. సంక్షిప్త స్కోర్లు : పాకిస్తాన్-218/8, జింబాబ్వే-255/8.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/