రాందేవ్ బాబాపై రూ. వెయ్యి కోట్ల ప‌రువు న‌ష్టం దావా

అల్లోప‌తి వైద్యంపై ఆరోప‌ణ‌ల ఫలితం: ఐఎంఏ ఉత్తరాఖండ్ శాఖ నోటీసులు

Ramdev Baba
Ramdev Baba

అల్లోప‌తి వైద్యం క‌రోనాను అదుపు చేయటంలో విఫ‌ల‌మైందంటూ ఆరోప‌ణ‌లు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ఉత్తరాఖండ్ శాఖ రూ. వెయ్యి కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేసింది.ఆయన చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌పై క్ష‌మాప‌ణ కోరుతూ వీడియో పోస్టు చేయ‌క‌పోయినా, 15 రోజుల్లో రాత‌పూర్వ‌క క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోయినా.. రూ. వెయ్యి కోట్ల ప‌రువు న‌ష్టం చెల్లించాల‌ని దావా నోటీసులో పేర్కొంది. రాందేవ్ బాబాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఉత్త‌రాఖండ్ సీఎం తీర్థ‌సింగ్ రావ‌త్‌కులేఖ పంపింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/