భారత్‌కు మద్దతు తెలిపిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు!

భద్రతా మండలిలో భారత్‌ ఎన్నికపై ప్రధాని మోడి హర్షం

pm-expressed-thanks-to-supporting-countries-in-uno

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసకమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోడి హర్షం వ్యక్తం చేశారు. భ‌ద్ర‌తామండ‌లిలో భారత తాత్కాలిక స‌భ్య‌త్వానికి మ‌ద్ధ‌తు తెలిపిన దేశాల‌కు ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రపంచ శాంతి, భ‌ద్ర‌త‌, స‌మాన‌త్వం కోసం భార‌త్‌ ఐక్యరాజ్యస‌మితి స‌భ్య‌దేశాల‌తో క‌ల‌సి ప‌నిచేస్తుంద‌ని ప్ర‌ధాని మోడి ట్విటర్‌లో పేర్కొన్నారు.. ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో నూత‌న అధ్య‌క్షుడి ఎన్నిక‌తోపాటు ఆర్థిక‌, సామాజిక మండ‌ళ్ల ఎన్నిక‌.. శాశ్వ‌త, తాత్కాలిక సభ్య‌దేశాల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా భార‌త్ ఐక్య‌రాజ్య‌స‌మితి తాత్కాలిక స‌భ్య‌దేశంగా ఎన్నికైంది. మొత్తం 193 స‌భ్య‌దేశాల్లో 184 దేశాలు భార‌త స‌భ్య‌త్వానికి మ‌ద్ద‌తు తెలిపాయి. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి భార‌త్‌కు మ‌ద్ద‌తు ప‌లికిన అన్ని దేశాల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ‌‌


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/