బిజెపితో కలిస్తే తమ గొయ్యి తాము తవ్వుకున్నట్లే: దీపేందర్‌సింగ్‌ హుడా

DEEPENDER SINGH HOODA
DEEPENDER SINGH HOODA

న్యూఢిల్లీ: నిన్న జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బిజెపి- శివసేన అధికారాన్ని చేజిక్కించుకోగా, హర్యానాలో మాత్రం ఏ పార్టీకి ఓటర్లు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. బిజెపి, కాంగ్రెస్‌లు ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 సీట్లను గెలుచుకున్న జెజెపి నేత దుష్‌యంత్‌ చౌతాలా బిజెపికి మద్దతిచ్చే ఆలోచనేలేదని తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో బిజెపి అధిష్టానం ఇండిపెండెంట్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. అయితే కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపి దీపేందర్‌సింగ్‌ హుడా మాట్లాడుతూ బిజెపికి స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తెలిపితే వారిని ప్రజలు చెప్పులతో కొడతారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. బిజెపితో కలిసే ఇండిపెండెంట్‌ అభ్యర్థులు వారి గొయ్యి వారు తవ్వుకున్నట్లు అవుతుందని చెప్పారు. అలా చేసే వారిని ప్రజలు క్షమించరు, సరైన సమయంలో చెప్పులతో సమాధానం చెపుతారన్నారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/