దీపికా కు ప్రత్యేక విందు ఇచ్చిన ప్రభాస్

ప్రభాస్ తో సినిమాలో నటించే నటి నటులకు భోజనం విషయంలో ఏ లోటు ఉండదు. షూటింగ్ జరిగినన్న రోజులు ప్రభాస్ ఇంటి నుండే భోజనం వస్తుంటుంది. ఆ భోజనం కూడా మాములుగా ఉండదు . రకరకాల వంటకాలతో అదిరిపోతాయి. ఆ వంటకాలు తిన్నవారు మరోసారి అలాంటి భోజనం ఎక్కడ తినరు. తాజాగా ప్రభాస్ ఇంటి రుచిని బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె చూసింది.

గతంలో ‘సాహో’ చిత్రీకరణ సమయంలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ముంబయి నుంచి హైదరాబాద్ రాగా… ఆమెకు పసందైన ఆంధ్రా వంటకాలతో ప్రభాస్ స్వాగతం పలికారు. ఆమె ప్రభాస్ ఆతిథ్యాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్-కె చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే కథానాయిక. ఇటీవల ఓ షెడ్యూల్ కోసం దీపిక హైదరాబాదులో అడుగుపెట్టింది. సెట్స్ పైకి వచ్చిన దీపికకు ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేకంగా వండించిన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను దీపిక సోషల్ మీడియాలో పంచుకుంది.