దీపిక లుంగీ డ్యాన్స్ అంతర్జాలంలో వైరల్

Deepika lungi dance

చెన్నయ్ ఎక్స్ ప్రెస్ చిత్రంలో కింగ్ ఖాన్ షారూక్ చేసిన నృత్యాల్ని అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇందులో దీపిక పదుకొనే లుంగీ పంచె కట్టి డ్యాన్సులు ఆడిన తీరును ప్రతిసారీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

తాజాగా మరోసారి దీపిక లుంగీ డ్యాన్స్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. అయితే ఈసారి లుంగీ డ్యాన్స్ చాలా స్పెషల్. ఇది జిమ్ లో లుంగీ డ్యాన్స్. ప్రముఖ శిక్షకురాలు యాస్మిన్ కరాచీవాలా ఆధ్వర్యంలో స్పెషల్ శిక్షణ పొందుతున్న దీపిక ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బరువైన తాళ్లను ఎత్తుతూ వార్ జోన్ లో ఉన్న సైనికురాలిలా కనిపిస్తోంది..

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/