దిగివచ్చిన పెట్రోల్‌ ధరలు

petro
petrol

న్యూఢిల్లీ: దేశీయ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం పెట్రోల్‌ ధర రూ.10పైసలు తగ్గింది. డీజిల్‌ ధర కూడా రూ.3పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.77.31కి పడిపోయింది. డీజిల్‌ ధర కూడా రూ.71.75గా నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగొచ్చాయి. అమరావతిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.10పైసలు తగ్గి రూ.76.94కు చేరింది. డీజిల్‌ ధర రూ.3పైసలు తగ్గి రూ.71.06కు చేరింది. విజయవాడలో లీటరు పెట్రోల్‌ ధర రూ.9పైసలు తగ్గి రూ.76.58గా, డీజిల్‌ ధర రూ.3పైసలు తగ్గి రూ.76.58గా నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.9పైసలు తగ్గి రూ.72.65గా, డీజిల్‌ లీటరుపై రూ.5పైసలు తగ్గి రూ.65.75గా నమోదైంది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.9పైసలు తగ్గి రూ.78.33గా, డీజిల్‌ ధర రూ.68.96గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ధర బ్యారెల్‌కు 0.47శాతం పడిపోయి 61.40డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటిఐ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 0.41శాతం తగ్గి 55.97కు చేరింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/