డికాక్‌ అరుదైన రికార్డు…

decock
decock


బెంగళూరు: టీమిండియా జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. టీమిండియా నిర్ధేశించిన 135 పరుగుల టార్గెట్‌ను సఫారీలు వికెట్‌ మాత్రమే కోల్పోయి చేధించారు. కాగా, డికాక్‌ ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. అంతర్జాతీయ టీ20 కెప్టెన్సీ అరంగేట్రంలోనే వరుసగా యాబైకిపైగా పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. భారత్‌తో జరిగిన రెండో టీ20లో డికాక్‌ 52 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్లుగా నియమితులై వరుసగా యాబైకి పైగా పరుగులు నమోదు చేసిన క్రికెటర్ల జాబితాలో పాల్‌ స్టిర్లింగ్‌ (ఐర్లాండ్‌), నవనీత్‌ సింగ్‌ (కెనడా0ల తర్వాత స్థానాన్ని డికాక్‌ ఆక్రమించాడు. ఇదిలా ఉంచితే..అంతర్జాతీయ టీ20ల్లో డికాక్‌ వెయ్యి పరుగుల్ని సాధించడం మరో విశేషం. ప్రస్తుతం డికాక్‌ 1018 పరుగులతో ఉన్నాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్‌ కీపర్ల జాబితాలో కుమార సంగక్కర (శ్రీలంక)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.

తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/