12వ తేదీ తర్వాతే నిర్ణయం.. రైల్వేశాఖ

ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ నిలిచిపోలేదు

train
train

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతొ, దేశంలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్థంబించిపోయింది. కాగా ఈ నెల 14న లాక్‌డౌన్‌ సమయం ముగియనుండడంతో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం, టికెట్ల బుకింగ్‌ పై రోజుకో వార్త వినిపిస్తుంది. దీనిపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. ఇప్పటికి వరకు సరుకు రవాణా చేసే రైళ్లు తప్ప మిగిలిన అన్ని రకాల రైళ్లు నిలిపివేశారు. కాగా ఈ నెల 14 న లాక్‌డౌన్‌ ముగిస్తుండగా.. ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్ల పునఃప్రారంభం పై ఈ నెల 12 వ తేది తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని చెప్పింది. బుకింగ్‌ ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని, కేవలం లాక్‌డౌన్‌ ఉన్న తేదిల్లో మాత్రం బుకింగ్స్‌ను రద్దు చేసినట్లు తెలిపింది. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చిన తరువాతే తాము ఒక నిర్ణయానికి వస్తామని తెలిపింది. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేసి, డిమాండ్‌ అధికంగా ఉంటే ప్రత్యేక రైళ్లను నడిపే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలిపింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/