డిసెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 12 రోజులు సెలవులు

డిసెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 12 రోజులు సెలవులు

నెల మారిందంటే ముందుగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవుతారు. ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు అనేవి చూస్తుంటారు. వాటిని బట్టి తమ బ్యాంకు పనులను చేసుకుంటుంటారు.. ఇక ఇప్పుడు డిసెంబర్ నెల రాబోతుంది. ఈ క్రమంలో బ్యాంకు ఖాతాదారులు డిసెంబర్ నెలలో ఎన్ని రోజులు సెలవులో తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే డిసెంబర్ నెలలో ఏకంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చినట్లు తెలుస్తుంది.

డిసెంబర్‌ 2021లో బ్యాంకుల సెలవులు:

డిసెంబర్ 3 – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివల్ (పనాజీలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 5 – ఆదివారం

డిసెంబర్ 11 – రెండో శనివారం

డిసెంబర్ 12 – ఆదివారం

డిసెంబర్ 18 – యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 19 – ఆదివారం

డిసెంబర్ 26 – ఆదివారం

డిసెంబర్ 24 – క్రిస్మస్ పండుగ (ఐజ్వాల్‌లో బ్యాంకులు పనిచేయవు)

డిసెంబర్ 25 – నాల్గవ శనివారం, క్రిస్మస్ (బెంగళూరు, భువనేశ్వర్ మినహా అన్ని ప్రదేశాలలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 27 – క్రిస్మస్ వేడుకలు (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 30 – యు కియాంగ్ నోంగ్‌బా (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 31 – నూతన ఏడాది సాయంత్రం (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)