కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న

Debashree Choudhury
Debashree Choudhury

హైదరాబాద్‌: బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్‌ ఎంపి దేబోశ్రీ పేర్కొన్నారు. ఆమె కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే ఇటివల రాయ్‌గంజ్‌లో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ.. దేబోశ్రీని గెలిపిస్తే కచ్చితంగా కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం తనకు ఇవాళ కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించారని దేబోశ్రీ తెలిపారు. అమిత్‌ షా సూచన మేరకు తాను బెంగాలీ భాషలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నానని ఆమె చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/