ఎస్‌బిఐ డెబిట్‌ కార్డ్‌ వినియోగదారులకు హెచ్చరిక!

జనవరి 1న ఆ కార్డులను బ్లాక్‌ చేయనున్న ఎస్‌బిఐ

Debit Card
Debit Card

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో అకౌంట్ కలిగిన వారికి హెచ్చరిక! మీ వద్ద ఇంకా మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులు ఉంటే వాటిని మార్చుకోవడానికి రేపే చివరి తేదీ. జనవరి 1వ తేదీ నుంచి మ్యాగ్‌స్ట్రిప్ కలిగిన డెబిట్ కార్డులను ఎస్‌బిఐ బ్లాక్ చేస్తుంది. దీంతో డిసెంబర్ 31వ తేదీలోగా ఈ కార్డులు మార్చుకోవాలని, కొత్త ఈవిఎం చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డులను తీసుకోవాలని బ్యాంకు మరోసారి సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు మోసపూరిత ట్రాన్సాక్షన్స్ నుంచి కస్టమర్ల సేఫ్టీ కోసం ఎస్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈవిఎం చిప్ కార్డునుతీసుకుంటేనే మీ కార్డు పని చేస్తుంది. ఈవిఎం చిప్ కార్డులు లేని ఎస్‌బిఐ కస్టమర్లు హోమ్ బ్రాంచీకి వెళ్లి తమ మ్యాగ్‌స్ట్రిప్ కార్డు స్థానంలో వీటిని మార్చుకోవచ్చు. మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల స్థానంలో ఈవిఎం చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఎస్‌బిఐ తమ కస్టమర్లకు పదేపదే విజ్ఞప్తి చేసింది. కొత్త ఈవిఎం చిప్ కార్డుల కోసం కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బిఐ కస్టమర్లు https://www.onlinesbi.com కు వెళ్లి ఏటిఎం కార్డ్‌ సర్వీసెస్‌ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో సూచనలు పాటిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ యోనో యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/