ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడు మృతి

1981 నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా పగ్గాలు

Hosni Mubarak
Hosni Mubarak

కెయిరో : ఈజిప్ట్‌ ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ (91) మంగళవారం నగరంలోని ఒక ఆస్పత్రిలో మరణించారు. దీర్ఘకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ముబారక్‌కు గాలా సైనిక ఆస్పత్రిలో సర్జరీ జరిగిందని ప్రభుత్వ టెలివిజన్‌ వెల్లడించింది. సర్జరీ తరువాత ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవటంతో ఆయన కన్ను మూశారని వివరించింది. సర్జరీ తరువాత ఆయన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వున్నారని ఆయన కుమారుల్లో ఒకరైన ఆలా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ముబారక్‌ మరణవార్తను ఆయన సమీప బంధువు జనరల్‌ మునీర్‌ థాబెట్‌ మీడియాకు వెల్లడించారు. 1981లో దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ముబారక్‌ 2011లో దేశంలో తలెత్తిన ప్రజల తిరుగుబాటు తో పదవి నుండి వైదొలగారు. అనంతరం అధికారం చేపట్టిన సైనిక ప్రభుత్వం ఆయన్ను వివిధ నేరారోపణలపై జైలుకు పంపిన విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/