ఆధార్‌పాన్‌ లింకింగ్‌కు సమీపిస్తున్న గడువు

డిసెంబరు 31 దాటితే పాన్‌కార్డు చెల్లదు

aadhaar-pan-linking
aadhaar-pan-linking

ముంబయి: ఆదాయపు పన్నుశాఖ ప్రకటించిన ఆధార్‌ పాన్‌ లింకింగ్‌ గడువు ఇక కేవలం ఏడు రోజులు మాత్రమేమిగిలి ఉంది. రిటర్నుదారులు తమ రిటర్నుల్లో ఆదాయపు పన్నుశాఖకు పాన్‌ నెంబరుతోపాటు ఆధార్‌ రెండూ లింక్‌ చేసుకుని ఉండాలని చెపుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 31వ తేదీతో ఈ గడువు ముగుస్తోంది. పాన్‌ ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరిచేసింది. ఎవరు లింకింగ్‌చేసుకోలేకపోయినా వారి పాన్‌నెంబరు చెల్లనేరదని ఆదాయపు పన్నుశాఖప్రకటించింది. ముందు ఐటి అధికారులు సెప్టెంబరునుంచే అమలుకు తీసుకువస్తామని ప్రకటించారు. అయితే అంతక ముందు జరిగిన లావాదేవీలు మాత్రం చెల్లుబాటవుతాయి. లావాదేవీల చెలామణిని పరిరక్షించేందుకుగాను పాన్‌కు గడువు పొడిగించి డిసెంబరు 31వ తేదీకి పొడిగించారు. ఆధార్‌తో పాన్‌ లింక్‌ అప్పటికీ కాని పక్షంలో ఇకపై వారి పాన్‌నెంబరు చెల్లనిదిగా ప్రకటించడంతోపాటు ఇకపై వారికి పాన్‌కార్డు కూడా జారీచేయడం వీలుపడదని ఐటి అధికారులు చెప్పారు. 31వ తేదీతర్వాల ఏ లావాదేవీ జరిపినా చట్టబద్ధం కాదు. ఇప్పటివరకూ కొందరు రిటర్ను దారులు ఆధార్‌నెంబరును కూడా ఐటి రిటర్నుల్లో పొందుపరచడంలేదు. ఆఫ్‌లైన్‌లోను, ఆన్‌లైన్‌లో కూడా ఆధార్‌ పాన్‌ లింకింగ్‌ వ్యవస్థను పొందుపరిచింది. ఇక పాన్‌ ఆధార్‌ను ఇప్పటికే లింక్‌ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి తనిఖీచేసుకోవాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/