ప్రియాంక హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

DCP Prakash Reddy
DCP Prakash Reddy

హైదరాబాద్‌: డాక్టర్‌ ప్రియాంక రెడ్డి మృతదేహానికి షాద్‌నగర్లో పోస్ట్‌మార్టం పూర్తి అయ్యింది. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. మరో వైపు .. ప్రియాంక రెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. డిసిపి ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. పంచర్‌ షాప్‌ వద్ద ఉన్న కెమెరా ఫూటేజ్‌ను పరిశీలించామన్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రియాంకను కారులో కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానాన్ని వ్యక్తపరిచారు. ప్రియాంక రెడ్డి స్కూటీ టైర్‌ ను కావాలనే ఎవరో పంచర్‌ చేసినట్లు పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరిచారు. చివరిసారిగా లారీ డ్రైవర్లు చుట్టుముట్టారని ఏడుస్తూ ప్రియాంక ఫోన్లో మాట్లాడిందని, లారీ డ్రైవర్ల వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/